ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!

by Dishafeatures2 |
ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతి ప్రియుడు చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియురాలిని దారుణంగా చంపిన యువకుడు అనంతరం ఆమెను ఫ్రిడ్జ్ లో దాచాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మృతురాలు నిక్కీ యాదవ్ కు సంబంధించిన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రేటర్ నోయిడాలోని నజఫ్ ఘర్ ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో ప్రియుడు సాహిల్ గెహ్లాట్ తో కలిసి నిక్కీ నివసిస్తోంది. 2018 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు.

అయితే వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి నిక్కీ అడ్డు తొలగించుకోవాలనుకున్న ప్రియుడు.. ఆమెను చంపి ఫ్రిజ్ లో ఉంచాడు. అనంతరం వేరే యువతితో అదే రోజు పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నిక్కీ చనిపోవడానికి కొన్ని గంటల ముందు భవనం మెట్లపై నుంచి తన ఫ్లాట్ కు వస్తున్న దృశ్యాలు అపార్ట్ మెంట్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.



Next Story

Most Viewed