సీబీఎస్‌ఈ త్రిభాషా విధానం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |

సీబీఎస్‌ఈ 9వ తరగతి విద్యార్థుల కోసం తెచ్చిన నూతన ‘త్రిభాషా సూత్రం’పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

సీబీఎస్‌ఈ త్రిభాషా విధానం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 9వ తరగతి విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ‘త్రిభాషా సూత్రం’ (Three-Language Formula) చట్టబద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ నూతన భాషా విధానంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అయితే, కొత్త విధానంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. విధానపరమైన నిర్ణయం కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేశాకే తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

కాగా, సీబీఎస్‌ఈ సవరించిన నిబంధనల ప్రకారం 9, 10 తరగతి విద్యార్థులు ఇకపై మూడు భాషలను అభ్యసించాల్సి ఉంటుంది. ఇందులో కనీసం రెండు తప్పనిసరిగా భారతీయ భాషలై ఉండాలి. అయితే, ఈ విధానాన్ని విద్యా సంవత్సరం మధ్యలో అమల్లోకి తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు విదేశీ భాషలను (Foreign Languages) సెకండ్ లాంగ్వేజ్‌గా చదువుతున్న విద్యార్థులపై ఇది అదనపు భారాన్ని మోపుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు.

Next Story