CBSE Results : సీబీఎస్ఈ ఫలితాల వదంతులు.. బోర్డ్ క్లారిటీ

by Muthe.Rajitha |

సీబీఎస్ఈ ఫలితాల(CBSE Results) వదంతుల(Fake News)పై బోర్డు క్లారిటీ ఇచ్చింది.

CBSE Results : సీబీఎస్ఈ ఫలితాల వదంతులు.. బోర్డ్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : సీబీఎస్ఈ ఫలితాల(CBSE Results) వదంతుల(Fake News)పై బోర్డు క్లారిటీ ఇచ్చింది. 10వ, 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలు మే 6న విడుదలవుతాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుండగా అవన్నీ ఫేక్ వార్తలుగా కొట్టిపడేసింది బోర్డ్. అయితే సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఎస్ఈ 10వ, 12వ తరగతుల ఫలితాలు విడుదల అవనున్నాయని వస్తున్న వదంతులను ఖండిస్తూ బోర్డ్ అధికారులు ఓ లేఖను విడుదల చేశారు. తాము ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అలాంటి వార్తలను నమ్మకూడదు అని కోరింది.

తాము ఏదైనా సమాచారం విడుదల చేస్తే దానిని తమ అధికారిక వెబ్సైట్ లో పొందుపరుస్తామని పేర్కొంది. కాగా ఈ ఏడాది అకడమిక్ ఇయర్ లో 10వ, 12వ తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 10వ తరగతికి చెందిన 24.12 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 12వ తరగతికి చెందిన విద్యార్థులు 17.88 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు దేశవ్యాప్తంగా 7,842 కేంద్రాలలో విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

Next Story