సీబీఎస్‌సీ 10వ తరగతి ఫలితాలు విడుదల

by Malleboina Mahesh |   (  Updated:2025-05-13 08:03:20  IST  )

CBSE 10వ తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా నమోదైంది.

సీబీఎస్‌సీ 10వ తరగతి ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: CBSE 10వ తరగతి పరీక్షల ఫలితాలను (results) అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా నమోదైంది. 2024లో 93.60% ఉండగా తాజా ఉత్తీర్ణత శాతం స్వల్ప పెరుగుదలను చూపుతుంది. 23,71,939 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా వారిలో 22,21,636 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఈ పరీక్షలను దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు మొత్తం 7837 సెంటర్లలో నిర్వహించారు. ఈ రోజు విడుదలైన ఫలితాల్లో త్రివేండ్రం రీజియన్ 99.79 శాతం ఉత్తీర్ణత శాతం తో టాప్ ప్లేస్ లో నిలవగా.. 84.14 శాతంతో గౌహతి చివరి స్థానంలో నిలిచింది. అలాగే విజయవాడ 99.79 శాతం ఉత్తీర్ణత తో రెండో స్థానంలో నిలవగా, బెంగళూరు 98.90 శాతంతో మూడో స్థానంలో, చెన్నై 98.71 శాతంతో నాలుగో స్థానంలో, పూణే 96.54 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్లు అయిన cbse.gov.in, cbseresults.nic.in, results.cbse.nic.in ద్వారా చెక్ చేయవచ్చు.

Next Story