- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE: పదో తరగతికి ఏటా రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్.. ప్రతిపాదనకు సీబీఎస్ఈ ఆమోదం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు సార్లు పదోతరగతి పరీక్షలు నిర్వహించనుంది.

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు సార్లు పదోతరగతి బోర్డు పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. సీబీఎస్ఈ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ (Sanyam baradaj) ఈ వివరాలను వెల్లడించారు. మొదటి దశ ఎగ్జామ్ ఫిబ్రవరిలో, రెండో దశ పరీక్ష మేలో కండక్ట్ చేయనుంది. అయితే తొలి విడత పరీక్షకు విద్యార్థులు హాజరుకావడం తప్పనిసరి. రెండో దశ కేవలం ఇంప్రూవ్‌మెంట్ కోసమే నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు విద్యార్థి హాజరుకాకపోయినా పర్వాలేదు. రెండు విడతల్లో వచ్చిన మార్కుల్లో ఏది బెటర్‌గా ఉంటే దానినే సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. మొదటి దశలో పరీక్షలు రాసి స్డూడెంట్స్ సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, లాంగ్వేజెస్‌లోని మూడు సబ్జెక్టులలో దేనిలోనైనా తమ మార్కులను మెరుగుపర్చుకోవడానికి అనుమతిస్తారు.
ఈ విధానంలో ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు ఉండబోవని బోర్డు స్పష్టం చేసింది. బదులుగా బోర్డు పరీక్ష, రెండో సెషన్ వారి స్కోర్‌లను మెరుగుపరచుకోవాలనుకునే వారికి సప్లిమెంటరీ పరీక్షగా ఉపయోగపడుతుంది. ఏడాదికోసారి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో హాజరు కాకపోతే వారిని రెండో దశ పరీక్షకు అనుమతించబోరు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ డిసిషన్ తీసుకున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. కాగా, సీబీఎస్ఈ ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలు ప్రకటించింది. దీనిపై పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభిప్రాయం తీసుకునేందుకు డొమైన్‌లో ఉంచారు. తాజాగా వివిధ నిపుణుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం అధికారికంగా ఆమోదించింది.
కోచింగ్ కల్చర్ తగ్గించడానికే
సీబీఎస్ఈ వెలువరించిన నోటిఫికేషన్‌లో ఈ నిర్ణయాలు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యంతో నూతన జాతీయ విద్యావిధానానికి లోబడి తీసుకున్న నిర్ణయమని వివరించింది. ఏడాది కాలంలో విద్యార్థులు మెయిన్ ఎగ్జామినేషన్‌తోపాటు మరోటి ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని, తద్వార కొంత ఒత్తిడి తగ్గించే అవకాశముంటుందని తెలిపింది. ఒత్తిడిని తగ్గించడానికి, కోచింగ్ కల్చర్‌కు అడ్డుకట్ట వేయడానికి సమీప భవిష్యత్‌లో మరిన్ని మార్పులు తీసుకోవచ్చని పేర్కొంది. వార్షిక/సెమిస్టర్/మాడ్యులర్ విధానాలు సహా ఇతర అవకాశాలను అన్వేషించాలని తెలిపింది. కోర్సు ముగియగానే పరీక్షలు పెట్టడం వల్ల కొంత ఒత్తిడి తగ్గించవచ్చునని, కొన్ని కఠినమైన సబ్జెక్టుల పరీక్షలను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్‌గా విడగొట్టవచ్చుననీ వివరించింది.






