మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

by Naga Rani Yarlagadda |

పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ఖతార్‌లో జరగాల్సిన CBSE (సీబీఎస్‌ఈ) పదవ, పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు దోహాలోని భారత ఎంబసీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

మార్చి 5, మార్చి 6 తేదీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 7 నుండి జరగబోయే పరీక్షలపై మార్చి 5వ తేదీన పరిస్థితిని సమీక్షించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని భారత ఎంబసీ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తాజా అప్‌డేట్స్ కోసం సంబంధిత పాఠశాల అధికారులతో సంప్రదింపులు జరపాలని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని రాయబార కార్యాలయం కోరింది.

Next Story