- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TVK: కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ పార్టీ ఆఫీస్‍కు సీబీఐ
కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని కరూర్‍లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట (Karur stampede) ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. గత శనివారం తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన సీబీఐ.. నేడు టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. అక్కడ దాదాపు గంట సేపు ఉన్న సీబీఐ టీమ్ ఘటనకు సంబంధించి కీలక వివరాలు కోరింది. అనంతరం టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటీఆర్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కరూర్ తొక్కిసలాటకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్‍తో పాటు ఇతర ఆధారాలను సీబీఐ అధికారులు అడిగారని చెప్పారు. ఆ వివరాలను తాము మూడు నాలుగు రోజుల్లో సమర్పిస్తామని సీబీఐకి చెప్పామన్నారు. సీబీఐ తమను కేవలం సమాచారం మాత్రమే అడిగిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసుల నేతృత్వంలోని సిట్ టీమ్ కు ఇప్పటికే అన్ని వివరాలు అందించామని ఇప్పుడు సీబీఐ కూడా అవే వివరాలు అడిగిందని తెలిపారు. తమకు నోటీసులు వస్తే సీబీఐ ఎదుట హాజరై అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కాగా, సెప్టెంబర్ 27న పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై తొలుత సిట్ చేపట్టింది. అయితే సిట్ పై తమకు నమ్మకం లేదని సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈకేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.






