అభిషేక్ బెనర్జీకి షాక్: సుప్రీంకోర్టు‌ ఊరటనిచ్చిన వదలని సీబీఐ

by Harish |   (  Updated:2023-04-17 12:44:47  IST  )

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు.

అభిషేక్ బెనర్జీకి షాక్: సుప్రీంకోర్టు‌ ఊరటనిచ్చిన వదలని సీబీఐ
X

కోల్‌కతా: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. ఉపాధ్యాయ నియామక స్కాంలో ప్రశ్నించేందుకు మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన గంటల వ్యవధిలోనే సీబీఐ సమన్లు జారీ చేయడం గమనార్హం. తమను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ వినియోగిస్తుందనే ఆరోపణల నడుమ ఈ చర్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ కూడా అవినీతిపై పోరాటంలో కేంద్ర సంస్థలకు దేశ ప్రజలు మద్దతుగా ఉంటారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Next Story