- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CBI: ఆపరేషన్ చక్ర-V.. 42 చోట్ల సీబీఐ దాడులు
సైబర్ క్రైమ్ నేరాలపై చర్యలు తీసుకునేందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనిఖీలు ముమ్మరం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ క్రైమ్ నేరాలపై చర్యలు తీసుకునేందుకు గాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తన దాడులను ముమ్మరం చేసింది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని 42 ప్రాంతాల్లో గురువారం దాడులు చేపట్టింది. ఆపరేషన్ చక్ర-v (Operation chakra-v) పేరుతో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తనిఖీలు చేసింది. ఈ క్రమంలోనే 9 మందిని అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 700 కి పైగా శాఖలలో సుమారు 8.5 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను తెరిచిన వ్యవస్థీకృత సైబర్ నేరస్థులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ ఖాతాలు సరైన కేవైసీ నిబంధనలు పాటించకుండా ఓపెన్ చేశారని తెలిపింది. సోదాల సమయంలో, అనేక నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ తెరిచిన పత్రాలు, లావాదేవీల వివరాలుచ కేవైసీ వివరాలను స్వాధీనం చేసుకున్నారు.






