కరూర్ తొక్కిసలాట.. విజయ్‌కు మరోషాక్

by Naga Rani Yarlagadda |

గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ కు చెందిన పార్టీ.. తమిళగ వెట్రి కళగం (TVK) నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర తొక్కిసలాట జరిగింది.

కరూర్ తొక్కిసలాట.. విజయ్‌కు మరోషాక్
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ లో విజయ్ కు చెందిన పార్టీ.. తమిళగ వెట్రి కళగం (TVK) నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నటుడు, రాజకీయ నేత విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈనెల 12న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సీబీఐ సమన్లు జారీ చేసింది. తాజాగా.. ప్రచారానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ లో సభ జరిగిన రోజున వాహనం ఎక్కడెక్కడ ప్రయాణించింది, ఎవరి అనుమతులు తీసుకుంది?, ఏ సమయంలో ఎక్కడ ఉందన్న వివరాలను తెలుసుకునేందుకు వెహికల్ ట్రావెల్ హిస్టరీని అధికారులు చెక్ చేస్తున్నారు. బస్సు నడిపిన డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గతేడాది నవంబర్ 25న పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఇతర ముఖ్యనేతలను కూడా విచారించింది. డిసెంబర్ 4న కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేలంను 2 గంటలపాటు ప్రశ్నించింది. సభకు అనుమతులివ్వడంపై ఆయన్ను పలు కోణాల్లో ప్రశ్నించింది. రెండురోజుల్లో విజయ్ ను విచారించనుండగా.. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కీలక సమాచారాన్ని రాబట్టాలని సీబీఐ భావిస్తోంది.

Next Story