CBI Director : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం పొడగింపు

by Muthe.Rajitha |

సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sood) పదవీకాలం పొడగించింది కేంద్ర ప్రభుత్వం.

CBI Director : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం పొడగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్(CBI Director Praveen Sud) పదవీకాలం పొడగించింది కేంద్ర ప్రభుత్వం. 1986 బ్యాచ్ కర్ణాటక కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్.. 2023 మే 25న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2025 మే 25తో ఆయన పదవీకాలం ముగియాల్సి ఉంది. అయితే కొత్త డైరెక్టర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం, ప్రవీణ్ సూద్ 2026 మే 24 వరకు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఈ పొడిగింపు నిర్ణయం ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకోబడింది.

ఈ కమిటీలో ప్రధాని మోడీతోపాటు సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా(CJI Sanjeev Khanna), లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(LOP Rahul Gandhi) సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం పలు సీనియర్ అధికారుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా, సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ద్వారా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ పొడిగింపును రాహుల్ గాంధీ వ్యతిరేకించారని వార్తలు వినవస్తున్నాయి. సూద్‌ గతంలో కర్ణాటకలో బీజేపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

Next Story