- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పురోగతి.. సిసోడియాకు బిగుస్తోన్న ఉచ్చు!
బ్రేకింగ్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పురోగతి.. సిసోడియాకు బిగుస్తోన్న ఉచ్చు!
దేశ రాజకీయక వర్గాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాపై సంచలన అభియోగాలు మోపుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు లభ్యమయ్యాయని తాజా ఛార్జ్ షీట్‌లో సీబీఐ పేర్కొంది. సిసోడియా ప్రతి సంవత్సరం రూ.500 కోట్ల అవినీతికి స్కెచ్ వేశారని ఆరోపించింది. గత కొంతకాలంగా సెలైంట్ అయిపోయిన ఈ కేసులో మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగించేందుకు సీబీఐ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
Next Story






