- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణెలో మహిళ అరెస్ట్
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ వేగం పెంచింది. పుణెలో ఓ మహిళను అరెస్ట్ చేసిన అధికారులు.. నిందితురాలిని ముంబై కోర్టులో హాజరుపరచనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనపై నిన్న కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఇవాళ ఉదయం రాజస్థాన్ కు చెందిన మంగీలాల్, దినేశ్ ను అదుపులోకి తీసుకున్న సీబీఐ తాజాగా పుణెకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో సంబంధం ఉందని అనుమానిస్తున్న మహిళను బిబ్వేవాడి ప్రాంతంలో అరెస్టు చేశామని తాము విచారించిన అనంతరం ఆమెను సీబీఐ అధికారులకు అప్పగించినట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. సదరు మహిళ బ్యూటీ పార్లర్ నడుపుతోందని ఇతర నింధితుల వద్ద ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆధారాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా లభించిన చాట్‍లు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సదరు మహిళ నిందితులకు విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించినట్లు అనుమానిస్తున్నారు. కాగా నిందితురాలిని ముంబయిలోని సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.






