Cast census: కుల గణన నివేదిక వాయిదా.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

by B.Srinivas |

కుల గణన నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం ముందుకు తీసుకురావడాన్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Cast census: కుల గణన నివేదిక వాయిదా.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: కుల గణన నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం ముందుకు తీసుకురావడాన్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తెలిపారు. గురువారం జరిగే కేబినెట్ మీటింగ్‌లో దీనిని బహిర్గతం చేయాలని భావించినా దీనిని పోస్ట్ పోన్ చేశారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లో కులగణనను పరిశీలిస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘నాతో సహా ఎవరూ నివేదికలోని అంశాలను చూడలేదు. నివేదికను కేబినెట్‌లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అందులోని వివరాలను బహిర్గతం చేస్తా్ం. పుకార్ల ఆధారంగా నివేదికను వ్యతిరేకించడం సరికాదు’ అని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, 2015లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. సుమారు రూ.169కోట్లతో చేపట్టిన ఈ సర్వే 2016 నాటికి పూర్తయినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని బహిర్గతం చేయలేదు.

Next Story