Casino : క్యాసినోలకు ప్రభుత్వం అనుమతి

by Muthe.Rajitha |

ఇకపై క్యాసినోలు(Casinoes) ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించుకునే అవసరం లేదు.

Casino : క్యాసినోలకు ప్రభుత్వం అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై క్యాసినోలు(Casinoes) ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించుకునే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఈ క్యాసినోలకు అనుమతి మంజూరు చేస్తోంది. ఇకపై ఈ అక్రమ జూదాన్ని అధికారికంగా థీమ్, వాటర్ పార్కులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, టూరిజం కాంప్లెక్సులలో అడుకోవచ్చు. అయితే ఇది మన దేశంలో మాత్రం కాదండోయ్. క్యాసినోలకు పుట్టిల్లు లాంటి థాయిలాండ్(Thailand) లో దేశంలో. మొదట్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ బిల్లు వివాదాస్పదం అయినప్పటికీ.. పర్యాటకులను ఆకర్షించేందుకు, టూరిజంలో ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ఈ బిల్లు ప్రకారం క్యాసినోలలోకి విదేశీలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. 20 ఏళ్ల లోపు వారికి ప్రవేశం నిషేధం. ఇక థాయ్ పౌరులు మాత్రం రూ.148 డాలర్ల చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

Next Story