- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు అనుమానాస్పద మృతి కేసు.. మాజీ డీజీపీ, మాజీ మంత్రులపై కేసు నమోదు
కొడుకు అనుమానాస్పద మృతి కేసులో ఏకంగా తల్లిదండ్రులు అయిన మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై కేసు నమోదు అయింది. ఈ షాకింగ్ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: కొడుకు అనుమానాస్పద మృతి కేసులో ఏకంగా తల్లిదండ్రులు అయిన మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై కేసు నమోదు అయింది. ఈ షాకింగ్ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా, ఆయన భార్య రజియా సుల్తానాల కుమారుడు అక్టోబర్ 16న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. మృతుడికి ఆయన కుటుంబానికి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్విల్ అక్తర్ ను తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో తల్లిదండ్రులతో పాటు మృతుని సోదరి, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఎఫ్ఐఆర్ చేర్చారు. నవంబర్ 6న అక్విల్ అక్తర్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం పంచకులలోని మానసా దేవి మందిర్ సమీపంలోని సెక్టార్ 4 లో నివసిస్తున్న పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా, పంజాబ్ మాజీ పీడబ్ల్యూడీ మంత్రి రజియా సుల్తానాలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు.






