- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్‌ను ఢీకొట్టి రెండు ముక్కలైన కారు! ముగ్గురు దుర్మరణం
అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. డివైడర్‌ను ఢీకొట్టిన ధాటికి కారు రెండు ముక్కలుగా విడిపోయింది.

దిశ, డైనమక్ బ్యూరో: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. డివైడర్‌ను ఢీకొట్టిన ధాటికి కారు రెండు ముక్కలుగా విడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కోట్‌లోని ఓ రైల్వే బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. కారు వేగంగా వచ్చి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. కారు శకలాలు రోడ్డుకు ఇరువైపులా ఎగిరిపడ్డాయి. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కారులో మొత్తం నలుగురు...
ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ముస్కాన్ బాగ్డా, అరుణ్ వాలా అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జైదీప్ చౌహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమిత్ పర్మార్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, మృతదేహాలకు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






