పెట్రోల్ డబ్బులు అడిగిన పాపానికి కారుతో తొక్కించి చంపారు.. బంగ్లాదేశ్‍లో మరో హిందువు దారుణ హత్య

by Prasad Jukanti |

బంగ్లాదేశ్‍లో మరో హిందూ హిందు వ్యక్తి హత్యకు గురయ్యాడు.

పెట్రోల్ డబ్బులు అడిగిన పాపానికి కారుతో తొక్కించి చంపారు.. బంగ్లాదేశ్‍లో మరో హిందువు దారుణ హత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‍లో (Bangladesh) హిందువులపై మారణకాండ ఆగడం లేదు. తాజాగా కారుతో తొక్కించి మరి మరో హిందువును పొట్టన పెట్టుకున్నారు. పెట్రోల్ బంక్ లో ఇందనం నింపుకుని డబ్బులు అడిగిన పాపానికి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానిక మీడియా శనివారం నివేదించింది. 30 ఏళ్ల రిపోన్ సహా (Ripon Saha Murder) అనే వ్యక్తి రాజ్‌బరిలోని గోలాండ మోర్ సమీపంలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ బంక్ లోకి ఒక బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూయిజర్ వచ్చింది. బంగ్లాదేశ్ కరెన్సీ లో 5000 టాకా విలువైన ఇంధనాన్ని ఫిల్ చేయించుకున్నారు. అయితే డబ్బు ఇవ్వకుండానే వెళ్లి పోతుండగా ఆ వాహనాన్ని సహా ఆపేందుకు ప్రయత్నించగా ఆ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా సహాను తొక్కించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో సహా స్పాట్‍లోనే చనిపోయాడు.

వాహనం యజమానికి ఆ పార్టీతో లింకులు:

ఈ హత్యను రాజ్ బరి సదర్ పోలీసులు ధృవీకరించారు. ప్రమాదంగా కాకుండా మర్డర్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. వాహనం యజమాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజ్ బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అని తెలిపారు. వాహనంతో పాటు దాని యజమానిని అరెస్టు చేశామని వెల్లడించారు. కాగా ఈ ఘటన బంగ్లాదేశ్‍లో మైనారిటీలపై జరుగుతున్న హింసాకాండకు అద్దంపడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story