- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి!
ఓ గెట్ టు గెదర్ కు వెళ్లి వస్తున్న వారిని నీళ్లబావి రూపంలో మృత్యువు కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నాసిక్ జిల్లా దిండోరి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తోన్న ఎంపీవీ వెహికల్ అదుపుతప్పి.. ఫుల్లుగా వాటర్ ఉన్న లోతైన బావిలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న 9 మందీ చనిపోయారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతులు ఒక కోచింగ్ క్లాస్ గెట్ టు గెదర్ కు వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల సమయంలో శివాజీనగర్ ప్రాంతంమీదుగా వెళ్తుండగా.. చీకటిలో డ్రైవర్ కు అక్కడ బావి ఉన్నట్లుగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. దిండోరి పోలీస్ ఇన్ స్పెక్టర్ మథురే నేతృత్వంలోని రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని రెండు హైడ్రా క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో వాహనాన్ని బావిలో నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అర్ధరాత్రి 12.15 గంటలకు వాహనాన్ని, అందులోనే మరణించిన మృతదేహాలను వేలికి తీశారు. మృతులను సునీల్ దత్తు దర్గుడే (32), రేష్మా సునీల్ దర్గుడే (27), ఆశా అనిల్ దర్గుడే (32),
ఖుషీ అనిల్ దర్గుడే (14), మాధురి అనిల్ దర్గుడే (13), శ్రేయాస్ అనిల్ దర్గుడే (11), రాఖి (గుణవంతి) సునీల్ దర్గుడే (11), శ్రావణి అనిల్ దర్గుడే (11), సమృద్ధి రాజేంద్ర దర్గుడే (7)గా గుర్తించారు. 9 మంది మృతి వారి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.






