- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని (Himachalpradesh) కులూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రోహ్‌తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద రహ్నీనలా (Rahninala) సమీపంలోని పర్వతం (Mountain) పైనుంచి కారు అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, అందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మనాలీ పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దార్యప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొండ ప్రాంతం ఘాటు రోడ్ కావటంతో వాహనం అదుపు ఉండవచ్చని అంచనా. కారులో ఉన్నవారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.






