Fatal Road Accident : బావిలో పడిన కారు.. ఆరుగురు స్పాట్ డెడ్

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్(MP) లో ఘోర రోడ్డు ప్రమాదం జరుగి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Fatal Road Accident : బావిలో పడిన కారు.. ఆరుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్(MP) లో ఘోర రోడ్డు ప్రమాదం జరుగి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మండ్సౌర్(Mandsaur Accident) జిల్లాలో కచారియా గ్రామంలో నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఆదివారం ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే గల బావిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో 13 మంది ప్రయాణికులు ఉండగా.. ఆరుగురు సంఘటన స్థలంలోనే మరణించారు. మిగిలిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (SDERF) బృందాలు బావిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు మూడు గంటలపాటు కష్టపడ్డాయి. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం లేదా రోడ్డు సరిగా లేకపోవడం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.

Next Story