గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. నదిలో నలుగురు గల్లంతు

by Naga Rani Yarlagadda |

ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్నవారు దారి తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.

గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. నదిలో నలుగురు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకున్నవారు దారి తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. నఖేడ గ్రామానికి చెందిన ఒక ఫ్యామిలీ.. మంగళవారం (ఆగస్టు 26) భిల్వారాలోని సవాయిభోజ్ కు వెళ్లి అదేరోజు రాత్రి తిరుగుపయనమైంది. డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ పెట్టుకోగా.. అదికాస్తా తప్పుగా చూపించింది. బనాస్ నదిపై ఉన్న సోమి - ఉప్రెడా కల్వర్ట్ పైకి కారు వెళ్లడంతో అక్కడ గొయ్యిలో పడిపోయింది. ఆపై నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో స్థానికులు ప్రమాదాన్ని గ్రహించలేదు. ఆ కారులో ఉన్నవారు కాపాడాలని అరవడంతో.. వారి కేకలు విన్న స్థానికులు ఐదుగురిని రక్షించారు. మరో నలుగురు గల్లంతవ్వగా వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైనవారికోసం సహాయక చర్యలు చేపట్టారు.

Next Story