సాయుధ బలగాల మానసిక ఆరోగ్యంపై కేంద్రం కీలక ప్రకటన

by Prasad Jukanti |

CAPFs, అస్సాం రైఫిల్స్ సిబ్బందికి వార్షిక వైద్య పరీక్షల్లో మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు

సాయుధ బలగాల మానసిక ఆరోగ్యంపై  కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర సాయుధ దళాల మానసిక ఆరోగ్యంపై (Mental Health) ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ఇవాళ పార్లమెంట్ కు సమాధానం ఇచ్చారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPFs) మరియు అస్సాం రైఫిల్స్ (AR) సిబ్బందికి ప్రతి ఏడాది వార్షిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇందులో మానసిక ఆరోగ్య పరీక్షలు కూడా ఉంటాయని తెలిపిపారు. ఇవాళ జీరో అవర్ లో కేంద్ర సాయుధ పోలీసు దళాలు/పోలీస్ సిబ్బందికి మానసిక ఆరోగ్య సదుపాయాలు పొందేందుకు ప్రభుత్వం ఏదైనా వ్యవస్థను రూపొందించిందా? విధి నిర్వహణ సమయంలో ఇలాంటి సిబ్బంది మానసిక ఆరోగ్యంపై అంచనా వేస్తున్నారా అని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మానసిక సమస్యలు ఉన్న సిబ్బందికి సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స, కౌన్సిలింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రత్యేక నిపుణుల వద్దకు చికిత్స కోసం రిఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

విశ్రాంతికి చర్యలు:

అలాగే విధి నిర్వహణ సమయంలో ఉన్నతాధికారులు అధికారులు సిబ్బందితో నిరంతరంగా మమేకమై వారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును అంచనా వేస్తుంటారని తెలిపారు. సరిపడ విశ్రాంతి లభించేలా డ్యూటీ అవర్స్ ను నియంత్రించడం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, వ్యక్తిగత, మానసిక సమస్యలపై నిపుణులతో చర్చలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే ధ్యానం, యోగాతో పాటు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Next Story