- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందా..? కానిస్టేబుల్ పరీక్ష కోసం ఫుట్‌పాత్‌లపై నిద్రించిన అభ్యర్థులు
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో రాజస్థాన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఉదాహరణ నిలుస్తోందని తాజాగా నెట్టింట చర్చానీయంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో (Rajasthan Police Recruitment) రాజస్థాన్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఉదాహరణ నిలుస్తోందని తాజాగా నెట్టింట చర్చానీయంశంగా మారింది. శని, ఆదివారం రాజస్థాన్‌లో పోలీస్ (constable exam) కానిస్టేబుల్-2025 పరీక్షను నిర్వహించారు. ఈ కానిస్టేబుల్ పరీక్షకు దాదాపు 3,76,902 మంది హాజరైనట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 10 వేల ఉద్యోగాలకు మొత్తం 5,24,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు 72 శాతం పాల్గొనడం విశేషం.
రాజస్థాన్‌లో 21 జిల్లాలో ఈ రాత పరీక్ష జరిగింది. నియామక ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. అయితే రాత పరీక్ష కోసం పట్టణ ప్రాంతాల్లో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఒక రోజు ముందు రాత్రి పట్టణ ప్రాంతాలకు చేరుకోని చాలా మంది యువత ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో షెల్టర్‌లు లేక ఫుట్‌పాత్, పార్క్‌లలో నిద్రించాల్సి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో 10 వేల పోస్టులకు 4 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో చాలా మంది కోటలో ఫుట్‌పాత్‌లపై రాత్రులు గడిపారు. దేశంలో నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందా?’ అని @IndianGems_ అనే యూజర్ వీడియో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఇది మనదేశ భవిష్యత్ అని నెటిజన్‌లు ఆవేదన చెందారు. ఈ మేరకు నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్వీట్ లింక్..






