- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Minister: మరో ఆరు నెలల్లో అందుబాటులో క్యాన్సర్ టీకా..!
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలకు మరో ఆరు నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మహిళలకు మరో ఆరు నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ప్రకటించారు. మరో ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ట్రయల్స్ జరుగుతున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రతాప్ రావ్ జాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లకు వ్యాక్సిన్ పరిశోధన దాదాపు పూర్తయ్యిది. ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుంది. తొమ్మిది నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాలికలు వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులు" అని అన్నారు. ఈ వ్యాక్సిన్ రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుందని తెలిపారు.
పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య
అంతేకాకుండా, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని కేంద్రమంత్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ చేయించుకుంటారని తెలిపారు. వ్యాధిని ముందస్తుగానే గుర్తించడానికి డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయుష్ కేంద్రాలుగా మార్చడంపైనా ఆయన స్పందించారు. ఆస్పత్రులలో ఆయుష్ విభాగాలు ఉన్నాయని.. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని.. ప్రభుత్వం వాటి సంఖ్యను పెంచుతోందన్నారు.






