2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 2 మిలియన్లకు పెరగొచ్చు

by Phanindra |

2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 2 మిలియన్లకు పెరగొచ్చని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఏటా 15 లక్షల కేసులు వెలుగు చూస్తున్నాయని చెప్పింి.

2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య 2 మిలియన్లకు పెరగొచ్చు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ కేసులున్న దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఈ వివరాలను వెల్లడించిన ఆయన.. 2040 నాటికి భారత్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య 20 లక్షలకు చేరొచ్చన్నారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సీన్‌ను భారత బయోటెక్నాలజీ విభాగం తయారు చేసిందని, దీన్ని తక్కువ ధరలో ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ప్రపంచంలో క్యాన్సర్ వ్యాధి వేగంగా పెరుగుతోందని, అంతర్జాతీయంగా ఏటా 2 కోట్ల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జితేంద్ర సింగ్ చెప్పారు. భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదువుతున్నాయని, ఈ సంఖ్య 2040 నాటికి 20 లక్షలకు చేరే అవకాశం ఉందని చెప్పారు.

Next Story