- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > 18 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్తూ విడాకులు తీసుకున్న ప్రధాని.. ఇన్‌స్టా పోస్ట్‌తో క్లారిటీ
18 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్తూ విడాకులు తీసుకున్న ప్రధాని.. ఇన్‌స్టా పోస్ట్‌తో క్లారిటీ
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సోఫి గ్రెగోయ్‌రీ 2005 వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సోఫి గ్రెగోయ్‌రీ 2005 వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏవో కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ, దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.
తాజాగా, జస్టిన్ విడాకుల గురించి అధికారికంగా ప్రకటిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నేను సోఫియా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, పిల్లల సంరక్షణ మాత్రం తామిద్దరం కలిసే చూసుకుంటామని ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని’’ రాసుకొచ్చాడు. అయితే సోఫి ఇప్పటికే ఒట్టావాలోని మరో నివాసానికి వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే ప్రధాని పదవిలో ఉండగా భార్యకు విడాకులు ప్రకటించిన ప్రధానిగా జస్టిన్ ట్రుడో నిలిచారు. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్ ట్రుడో కావడం విశేషం.
Next Story






