పంజాబ్‌లో దారుణం.. పాట ఆపమన్నందుకు కెనడీయన్ హత్య

by Disha Web Desk 13 |
పంజాబ్‌లో దారుణం.. పాట ఆపమన్నందుకు కెనడీయన్ హత్య
X

మొహాలీ: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. మొహలీ లో పాటలు ఆపమని చెప్పినందుకు కెనడియన్‌ను హత్య చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో కెనడా నుంచి ప్రదీప్ సింగ్ భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని నిరంజన్ సింగ్‌గా గుర్తించారు.

‘కొందరు వ్యక్తులు ఆరుబయట కారులో పెద్దగా పాటలు పెట్టుకుని వింటుండగా ప్రదీప్ సింగ్ వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి లోనైన వ్యక్తులు అతడి పై దాడి చేయగా ప్రదీప్ మరణించాడు’ అని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజలు సామరస్యంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.



Next Story

Most Viewed