- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌తో కెనడా భారీ ట్రేడ్ డీల్.. మార్చిలో వస్తున్న కెనడా ప్రధాని
భారత్‌తో కెనడా భారీ ట్రేడ్ డీల్ చేసుకోనుంది. దీనికోసం మార్చిలో కెనడా ప్రధాని భారత్‌కు వస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని మార్క్ కార్నీ మార్చి తొలి వారంలో భారత పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో మైనింగ్, ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో కీలకమైన పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిలో 2.8 బిలియన్ కెనడా డాలర్ల విలువైన యురేనియం సప్లయ్ డీల్ కూడా ఉందని సమాచారం. పదేళ్ల పాటు యురేనియం సరఫరా చేసేందుకు జరిగే ఈ ఒప్పందంతో కెనడా-భారత్ మధ్య న్యూక్లియర్ సహకారం మరింత బలోపేతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు క్రిటికల్ మినరల్స్, క్రూడ్ ఆయిల్, లిక్విఫయిడ్ నేచురల్ గ్యాస్, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలు, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర అంశాల్లో కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ పర్యటన కోసం ఏర్పాట్లు మొదలయ్యాయని కెనడాలో భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ వెల్లడించారు. ఈ విషయాలను చర్చించేందుకు కెనడా ఎనర్జీ మినిస్టర్ టిమ్ హాడ్గ్‌సన్ ఈ వారంలోనే భారత్‌కు వస్తున్నారు. కేవలం యూఎస్‌తోనే ఎక్కువగా వాణిజ్యం చేసే కెనడా.. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవలే చైనాతో కెనడా డీల్ చేసుకుంటోందని వార్తలు రావడంతో ట్రంప్ మండిపడిన సంగతి తెలిసిందే. చైనాతో ఎలాంటి ట్రేడ్ డీల్ చేసుకున్నా కెనడాపై 100 శాతం సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు. ఈ క్రమంలోనే భారత్‌తో భారీ ట్రేడ్ డీల్ చేసుకునేందుకు కెనడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.






