కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో భారీ మార్పులు

by Ajay Maddhiboyina |

సవరించిన నిబంధనలు అనుసరించి కెనడియన్ ఇమ్మిగ్రేషన్, బార్డర్ అధికారులకు నిర్థిష్ట పరిస్థితుల్లో ఈటీఏలు, టీఆర్వీలు, వర్క్ వీసా, రీసెర్చ్ వీసా రద్దు చేయడానికి అధికారాన్ని ఇస్తాయి.

కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో భారీ మార్పులు
X

- అధికారులకు వీసా రద్దు చేసే అధికారం

- వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం

- జనవరి 31 నుంచే అమల్లోకి కొత్త నిబంధనలు

దిశ, నేషనల్ బ్యూరో: ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కెనడా భారీ మార్పలు చేసింది. కొత్త ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ నిబంధనలు జనవరి 31 నుంచే అమల్లాకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్‌లు (ఈటీఏ), తాత్కాలిక నివాస వీలులు (టీఆర్వీ) వంటి వాటిని రద్దు చేయడానికి బార్డర్ ఆఫీసర్లకు అధికారాలు ఉండేలా మార్పులు చేసింది. కాగా, కొత్త వీసా నిబంధనలు ఏటా వేలాది మంది విదేశీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మార్పుల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, తాత్కాలిక నివాస వీసాలపై సందర్శించే వారిపై ప్రభావం చూపుతాయి. కాగా, ఇందులో భారతీయులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించే భారతీయ విద్యార్థులకు కెనాడా కూడా ముఖ్యమైన ఛాయిస్‌గా ఉంది. ప్రస్తుతం కెనడాలో 4,27,000 భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. కాగా, 2024 చివరలో స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ వీసా ప్రోగ్రామ్‌ను కెనడా రద్దు చేసింది.

సవరించిన నిబంధనలు అనుసరించి కెనడియన్ ఇమ్మిగ్రేషన్, బార్డర్ అధికారులకు నిర్థిష్ట పరిస్థితుల్లో ఈటీఏలు, టీఆర్వీలు, వర్క్ వీసా, రీసెర్చ్ వీసా రద్దు చేయడానికి అధికారాన్ని ఇస్తాయి. ఒక వ్యక్తి స్థితి, పరిస్థితులకు అనుగుణంగా వారిని పూర్తి అనర్హులుగా చేయడం లేదా వారికి అనుమతి పత్రాలు నిరాకరించడం చేయవచ్చు. తప్పుడు సమాచారం అందించడం, నేర చరిత్ర కలిగి ఉండటం వంటి అంశాల్లో అధికారులు వీసాను రద్దు చేసే అధికారం ఉంటుంది. ఒక వ్యక్తి వీసా గడువు ముగిసిన తర్వాత కెనడాను విడిచిపెడతాడని అధికారికి నమ్మకం లేనప్పుడు కూడా వీసాను నిరాకరించే అవకాశం ఉంది.

కాగా, కొత్త నిబంధనల కారణంగా దాదాపు 7వేల అదనపు తాత్కాలిక రెసిడె్స్ వీసాలు, వర్క్ పర్మిట్లు, రీసెర్చ్ అనుమతులు రద్దు చేయబడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారతీయులతో పాటు విదేశీయుల పర్మిట్లు రద్దు అయితే వారు కెనడియన్ సరిహద్దులోకి ప్రవేశించకుండా నిషేధిస్తారు. లేదంటే కెనడా విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కెనడాలో చదువుతున్న 4,27,000 మంది విద్యార్థులతో పాటు, భారతదేశం నుండి ఏటా లక్షలాది మంది పర్యాటకులు కూడా వస్తున్నారు. 2024 జనవరి- జూలై మధ్య భారతీయులకు 3,65,750 సందర్శకుల వీసాలను జారీ చేసింది. 2023లో ఇదే కాలంలో జారీ చేయబడిన 345,631 కంటే ఎక్కువ.

Next Story