- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Canada: కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి.. అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్య తర్వాత కెనడా(Canada), ఇండియా(India)ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ఇండియన్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక పరిస్థితుల కారణంగా విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer jaiswal) తెలిపారు. ఇటీవల జరిగిన హత్యలపై కెనడా అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒట్టావాలోని రాయబార కార్యాలయం, ఇతర నగరాల్లోని కాన్సులేట్‌లు కూడా సంఘటనల సమగ్ర విచారణ కోసం స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ‘గత వారం భారత్‌కు దురదృష్టకర విషాదాలు ఉన్నాయి. ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్య చేయబడ్డారు. కెనడాలో భారతీయులను భయాందోళనకు గురి చేసిన ఈ ఘటనల పట్ల చింతిస్తున్నాం’ అని తెలిపారు.
కాగా, డిసెంబరు మొదటి వారంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ నెల 1న పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్ అనే విద్యార్థిని తన రూమ్ మేట్ కత్తితో పొడిచి చంపేశాడు. అలాగే పంజాబ్‌కు చెందిన మరో విద్యార్థి బ్రిటిష్ కొలంబియాలో అనుమానస్పదంగా మరణించాడు. అనంతరం డిసెంబర్ 6న మరో భారత సంతతికి చెందిన వ్యక్తి హర్షన్‌దీప్ సింగ్‌ను ఎడ్మాంటన్‌లో ఒక ముఠా కాల్చి చంపింది. ఈ హత్యలతో భారతీయ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర అడ్వైజరీ జారీ చేసింది.