Canada: కెనడా సార్వత్రిక ఎన్నికలు.. ఆ పార్టీ వైపే ఓటర్ల మొగ్గు !

by B.Srinivas |

కెనడాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ఓటింగ్ షురూ కాగా.. మంగళవారం ఉదయం 4:30 వరకు కొనసాగనుంది.

Canada: కెనడా సార్వత్రిక ఎన్నికలు.. ఆ పార్టీ వైపే ఓటర్ల మొగ్గు !
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada)లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ఓటింగ్ షురూ కాగా.. మంగళవారం ఉదయం 4:30 వరకు కొనసాగనుంది. 12గంటల పాటు పోలింగ్ కేంద్రాలు తెరచి ఉంటాయి. దీంతో కెనడియన్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మే 1వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, కెనడాలో ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రధాని మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.

బరిలో 4 ప్రధాన పార్టీలు

కెనడాలో నాలుగు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వాటిలో లిబరల్ పార్టీ (Liberal party), కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party), న్యూ డెమోక్రాట్స్ (NDP), బ్లాక్ క్యూబెకోయిస్ ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి 152 స్థానాలున్నాయి. ప్రతిపక్షంలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. దీంతో మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. కన్జర్వేటివ్ పార్టీ సైతం గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, మిగతా పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపబోవని సమాచారం.

Next Story