J&K Attack: ఆయన కలుగులో .. ఈయన ప్యాలెస్ లో.. పాక్ ఆర్మీ చీఫ్ పై అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam terror attack)పై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఈ ఘటనను ఖండిస్తున్నాయి.

J&K Attack: ఆయన కలుగులో .. ఈయన ప్యాలెస్ లో.. పాక్ ఆర్మీ చీఫ్ పై అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam terror attack)పై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఈ ఘటనను ఖండిస్తున్నాయి. దీనిపై అమెరికా మాజీ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ (Osama Bin Laden), పాకిస్థాన్‌ ఆర్మీ చాఫ్‌ అసీం మునీర్‌కు పెద్ద తేడా లేదని పెంటగాన్‌ మాజీ అధికారి మైఖెల్‌ రూబిన్‌ అన్నారు. బిన్‌లాడెన్‌ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్‌ ప్యాలెస్ లో ఉంటున్నారని.. ఇదే వారి మధ్య తేడా అని విమర్శించారు. కానీ, ఇద్దరి ముగింపు ఒకేలా ఉండాలని చెప్పుకొచ్చారు. ‘‘అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్‌లో ఇలాంటి దాడే జరిగింది. మళ్లీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటిస్తుండగా పెహల్గాంలో ముష్కరులు దారుణానికి పాల్పడ్డారు. ఈ దాడిపై పాక్‌ స్పందిస్తూ తమకు సంబంధం లేదని, స్థానికులే ఈ ఘోరానికి పాల్పడ్డారని అంటోంది. అయితే, ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా.. ఆ దేశం ఎలాంటిదో అందీ తెలుసు. పెహల్గాం దాడిపై అమెరికా చేయాల్సింది ఒక్కటే..! పాక్‌ (Pakistan)ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలి’’ అని మైఖెల్‌ రూబిన్‌ అన్నారు.

రెచ్చగొట్టే ప్రసంగం తర్వాత దాడి

పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పెహల్గాం ఉగ్రదాడి జరగడంతో దీనిపై అందరూ ఆయన్నే నిందిస్తున్నారు. ఆయనవైపే చూపిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. కశ్మీర్ తమ జీవనాడి అని, దాన్ని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ వైఖరి స్పష్టమని.. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం అంటూ చెప్పుకొచ్చారు. మంగళవారం సాయంత్రం పహల్గాంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరన్‌లో ముష్కరులు విధ్వంసం సృష్టించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. పర్యటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story