- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవచ్చా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
by Muthe.Rajitha |
2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రద్దయిన ఈ నోట్లు మళ్ళీ మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రద్దయిన పాత నోట్లు ఇప్పుడు మార్చుకునేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలు ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది.
Next Story






