- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్దానికి అయ్యే ఖర్చును భారత్ భరించగలదా? సైన్యానికి కేటాయించిన బడ్జెట్ ఎంత?
ఇండియా పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలు చూస్తుంటే యుద్దం తప్పేలా కనిపించడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయాలు చూస్తుంటే యుద్దం తప్పేలా కనిపించడం లేదు. ప్రధాని మోడీ రక్షణశాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హెంశాఖ మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. మరోపక్క పాకిస్థాన్ బార్డర్ వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అంతే కాకుండా ఇటీవల పాకిస్థాన్ తమ రక్షణశాఖ బడ్జెట్ 18శాతం పెంచామని దానివల్ల నిధుల కొరత నెలకొందని చెబుతోంది. యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. రక్షణశాఖకు ఖరీదైన ఆయుదాలు అవసరం అవుతాయి. అవసరమైతే ఆర్మీ సంఖ్యను కూడా పెంచాల్సి వస్తుంది.
దీనికి చాలా బడ్జెట్ అవసరం. మరి యుద్దం వస్తే భారత్ అంత ఖర్చును భరించగలదా అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ప్రభుత్వ ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం ఖచ్చితంగా యుద్దం వస్తే ఆ ఖర్చును భరించగలదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరవాత రక్షణశాఖకు కేటాయింపులు చేసినట్టు ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్ లో రక్షణశాఖ కోసం రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించినట్టే పేర్కొన్నాయి. గతంతో పోలిస్తే ఈ బడ్జెట్‌లో 9.53 శాతం నిధులు కేటాయించినట్టు తెలిపారు.
నిధులు వాడుకోవడం ఇప్పుడే మొదలైందని యుద్దం వచ్చినా, మిలిటరీ దాడులు జరిపినా ఈ ఏడాది చివర వరకు బడ్జెట్ కోసం ఆందోళన అవసరం లేదని తెలిపారు. దేశంలో ఆర్థికలోటు పెద్దగా లేదని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో భారత ఆర్థిక లోటు 9.2 వద్ద ఉండగా ప్రస్తుతం 4.4శాతంగా ఉందని పేర్కొన్నాయి. భారత్ ఆర్థికంగా బలంగా ఉందని డబ్బు అసలు సమస్యే కాదని పేర్కొన్నాయి.
యుద్దం వస్తే అత్యవసరంగా ఏవైనా యుద్ద సామాగ్రి అవసరం అయితే వాటికోసం కావాల్సిన నిధులు కూడా ఇప్పటికే మంజూరు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఆపాలని భారత్ బ్యాంకులకు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను కోరింది. దీంతో పాకిస్థాన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ భారత్‌కు ఆర్థికపరంగా ఎలాంటి సమస్య ఉండదని తెలుస్తోంది. ప్రపంచంలో ఆర్మీకి ఎక్కువ నిధులు కేటాయించే దేశాల్లో కూడా భారత్ ఐదో స్థానంలో ఉంటే పాకిస్థాన్ ఎక్కడో వెనకబడిపోయింది. కాబట్టి యద్దం వచ్చినా, మిలటరీ దాడులు జరిగినా ఆర్థికపరంగా భారత్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కానీ అసలే ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పరిస్థితి మాత్రం మరింత దిగజారిపోవడం పక్కా.






