- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cambodia: థాయ్ లాండ్, కంబోడియా ఘర్షణ.. 11 మంది మృతి
ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలపై ఘర్షణకు దిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు ప్రాంతాలపై ఇరు దేశాలు ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల బార్డర్లలో కాల్పులు జరిగాయి. కంబోడియా సైనికుల కాల్పుల్లో 11 మంది థాయ్ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 14 మంది గాయపడ్డారు. సీసాకెట్ ప్రావిన్స్‌లో అత్యధిక ప్రాణనష్టం సంభవించిందని థాయ్ సైన్యం ధ్రువీకరించింది. ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్‌పై కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారని తెలిపింది. అలాగే కంబోడియా సైనిక లక్ష్యాలపై థాయ్ లాండ్ వైమాణిక దాడులకు పాల్పడింది. ఉద్రిక్తలు పెరడగంతో థాయిలాండ్ తన సరిహద్దులో ఎఫ్-16 యుద్ధ విమానాలను మోహరించింది. కాగా, ఈ ఏడాది మే 28న ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిలో కాంబోడియా సైనికులు మరణించాడు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది.
వివాదానికి కారణమిదే?
థాయిలాండ్, కంబోడియాలు 800 కిలోమీటర్ల భూ సరిహద్దును పంచుకుంటాయి. ఫ్రెంచ్ వలసవాదులు 1863 నుంచి 1953 వరకు కంబోడియాను ఆక్రమించి టైంలో ఈ సరిహద్దును కుదిర్చారు. అయితే ఆ మ్యాపులో ప్రీహ్ విహార్ అనే చారిత్రాత్మక ఆలయాన్ని కంబోడియాలో భాగంగా చూపించారు. దీనిని థాయిలాండ్ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ అంశంపై రెండు దేశాల మధ్య వివాదం నెలకొంది. 1959లో కంబోడియా ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా కంబోడియాకు అనుకలంగానే తీర్పు వచ్చింది. దీనిని థాయ్ లాండ్ అంగికరించినప్పటికీ చుట్టుపక్కల సరిహద్దులు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. 2008లో కంబోడియా ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ వివాదం మరింత పెరిగింది. 2011లోనూ ఘర్షణలు చెలరేగాయి. దీంతో తాజాగా మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొనడం గమనార్హం.






