- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజ్‌ఫైర్ డిమాండ్ చేస్తున్న కంబోడియా.. థాయ్‌ల్యాండ్‌తో ఘర్షణల్లో 32 మంది మృతి
థాయ్‌ల్యాండ్‌తో ఘర్షణల నేపథ్యంలో తాము సీజ్‌ఫైర్ డిమాండ్ చేస్తున్నట్లు కంబోడియా తెలిపింది. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 32 మంది మృతి చెందినట్లు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ దాడుల్లో 32 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని అంచనా వేసేందుకు, దీనిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించింది. ఈ ఉద్రిక్తతలపై యూఎన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
అయితే 15 మంది సభ్యులు కూడా ఇరుదేశాలు దాడులు ఆపాలని, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని కంబోడియా, థాయ్‌ల్యాండ్‌లకు సూచించినట్లు అధికారులు తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏసియన్) కూటమి ఈ పోరాటం ఆపేందుకు ప్రయత్నించాలని కూడా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పిలుపునిచ్చింది.
ఈ సమావేశానికి పిలుపునిచ్చిన కంబోడీయి యూఎన్ అంబాసిడర్ చియా కియో మాట్లాడుతూ.. తమ దేశా సీజ్‌ఫైర్ కోరుతోందని, సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటోందని చెప్పారు. కంబోడియానే ముందుగా థాయ్‌ల్యాండ్‌పై దాడి చేసిందనే ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. తమతో పోలిస్తే మూడింతల సైన్యం ఉన్న దేశంపై కనీసం వాయుసేన కూడా లేని తమ వంటి చిన్నదేశం ఎందుకు దాడి చేస్తుందని ప్రశ్నించారు.
భారత్ ట్రావెల్ అడ్వయిజరీ..
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని థాయ్‌ల్యాండ్‌లోని భారత ఎంబసీ సూచించింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌ల్యాండ్ (టీఏటీ) ఇచ్చే సమాచారాన్ని అనుసరించాలని తెలిపింది. ఇటీవలే సరిహద్దు సమీపంలోని ఉబాన్ రాచథాని, సురిన్, సిసాకెత్, బురిరామ్, సా కేయో, చంతాబురి, ట్రాట్ ప్రావిన్సులకు పర్యాటకులు వెళ్లొద్దని టీఏటీ హెచ్చరించింది. భారత ఎంబసీ కూడా ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని భారత ప్రయాణికులను కోరింది.






