Delhi Metro: ఢిల్లీ మెట్రో లైన్ లో కేబుల్ చోరీ.. బ్లూ లైన్ లో సేవలకు అంతరాయం

by Shamantha N |

ఢిల్లీ మెట్రో(Delhi Metro) లైన్ లో కేబుల్ చోరీ అయ్యింది. సీసీటీవీ లేని ట్రాక్ లో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారులు తెలిపారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రో లైన్ లో కేబుల్ చోరీ.. బ్లూ లైన్ లో సేవలకు అంతరాయం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మెట్రో(Delhi Metro) లైన్ లో కేబుల్ చోరీ అయ్యింది. సీసీటీవీ లేని ట్రాక్ లో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారులు తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతం పారిశ్రామిక జోన్‌కు ఆనుకుని ఉందని వెల్లడించారు. మోతీ నగర్, కీర్తి నగర్ స్టేషన్ల మధ్య గురువారం రాత్రి చోరీ జరిగిందన్నారు. బ్లూలైన్ ప్రాంతంలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి పనివేళల తర్వాత సమస్యను పరిష్కరిస్తామని డీఎంఆర్‌సీ తెలిపారు. ప్రస్తుతం ఎదురైన సమస్యను రాత్రి సేవలు నిలిచిన తర్వాత మాత్రమే సరిచేయగలమని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు రైళ్లను పరిమిత వేగంతో నడుపుతామని వెల్లడించారు. ఈ సమస్యపై డీఎఆర్సీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. ఆలస్యమైన సర్వీసుల కారణంగా ప్రయాణికులకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది.

Next Story