- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cabinet Meeting: కొనసాగుతోన్న కేంద్ర కేబినెట్ మీటింగ్.. చర్చకు వచ్చిన కీలక అంశాలివే!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్ (Central Cabinet Meeting) ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్ (Central Cabinet Meeting) ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో భాగంగా బడ్జెట్ సమావేశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbhmela)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేబినెట్ విచారం వ్యక్తం చేసింది. అదేవిధంగా తొక్కిసలాటకు సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మౌని అమావాస్య (Mouni Amavasya) సందర్భంగా పుణ్య స్నానాల కోసం పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. అయితే, భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు సుమారు 17 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో పవిత్ర ‘అమృత్ స్నాన్’ (Amruth Snan)ను యూపీ సర్కార్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే ఘటనపై తాజాగా కేంద్ర కేబినేట్‌లో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం విషయంలో కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయం పెంపు ఓ మంత్రి వర్గం ఓ నిర్ణయానికి రానుంది.
కాగా, ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా ఇస్రో (ISRO)లో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి వర్గం (Central Cabinet) ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (Central Government Employees)కు కూడా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌ను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించారు.






