- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం
ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్‌కు రూ.51 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఏడాదికి 120 పని దినాలు తప్పనిసరి చేసింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటిగా ఉంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ఆటంకం లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పేరును మార్చాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పథకం పేరు మార్పుపై చర్చించారు. అనంతరం పేరు మార్పు నిర్ణయానికి కేబినెట్ తరపున ఆమోదం తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఈ పథకం పేరు మారుస్తున్నట్లుగా వర్గాలు తెలిపాయి.






