- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Cabinet: 4 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
దీంతో ఈ మిషన్ కింద మొత్తం ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం దాదాపు రూ. 4,594 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. దీంతో ఈ మిషన్ కింద మొత్తం ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరింది. ఇవి ఆరు రాష్ట్రాలలో దాదాపు రూ. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో నిర్మితమవుతున్నాయి. కొత్తగా ఆమోదించిన నాలుగు ఆంధ్ర ప్రదేశ్,పంజాబ్, ఒడిశాలలో ప్రారంభం కానున్నాయి. 2034 నాటికి నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఈ సెమీకండక్టర్ ప్రాజెక్టులు కీలకంగా వ్యవహరించనున్నాయి. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో కీలకమైన కాంపౌండ్ సెమీకండక్టర్లు, అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లపై ఈ ప్రాజెక్టులు దృష్టి సారిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్లు లేకుండా, ఏ దేశం కూడా తమని తాము అభివృద్ధి చెందినవిగా చెప్పుకోలేవని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టెలికాం, డేటా సెంటర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌లో సెమీ కండక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా ఆమోదించిన నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులు దేశీయ సాంకేతిక స్వావలంబనను సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇదే సమయంలో పట్టణ రవాణాను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో లక్నో మెట్రో ఫేజ్ 1బీ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం రూ.5,801 కోట్లను ఖర్చు చేయనున్నారు.






