CAA: సీఏఏ కటాఫ్ తేదీ పొడిగింపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by B.Srinivas |

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కటాఫ్ తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది.

CAA: సీఏఏ కటాఫ్ తేదీ పొడిగింపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టం (CAA) కటాఫ్ తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. 2024 డిసెంబర్ 31 నాటికి దేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ (Pakisthan), అప్గానిస్తాన్ (Afganisthan) , బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవ శరణార్థులను బహిష్కరించబోమని, వారు భారత్‌లో ఉండేందుకు అనుమతిస్తామని పేర్కొంది. వీరంతా పాస్ పోస్ట్, ఇతర పత్రాలు లేకపోయినప్పటికీ దేశంలో నివసించొచ్చు. సీఏఏ అమల్లోకి వచ్చినప్పుడు 2014 డిసెంబర్ 31 కటాఫ్ డేట్ ఉండగా దానిని పొడిగించడం గమనార్హం. దీంతో పలువురు శరణార్థులకు ఉపశమనం కలిగినట్టు అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ -2025 కింద ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, 2024 మార్చి 11 నుంచి దేశంలో సీఏఏ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Next Story