బైజూస్ రవీంద్రన్ కు భారీ షాక్.. 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు

by Naga Rani Yarlagadda |

బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కు భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన

బైజూస్ రవీంద్రన్ కు భారీ షాక్.. 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ కు భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్ పై అమెరికా కోర్టు ఎలాంటి వాదనలకు ఆస్కారం లేకుండా డిఫాల్ట్ జడ్జిమెంట్ వెల్లడించింది. బైజూస్ రవీంద్రన్ కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించి, వాటిని దాచిపెట్టారని నిర్థారించిన కోర్టు.. పిటిషనర్ కు 1.07 బిలియన్ డాలర్లు (రూ.8900 కోట్లకు పైగా) చెల్లించాలని ఆదేశించింది.

బైజూస్ సేవలందిస్తూనే.. 2021లో బైజూస్ ఆల్ఫాను నెలకొల్పారు. అంతర్జాతీయంగా నిధులను సమీకరించేందుకు దీనిని స్థాపించారు. ఫలితంగా బైజూస్ ఆల్ఫా 1 బిలియన్ టర్మ్ లోన్-బిని పొందింది. లోన్ కండీషన్లను బైజూర్ ఉల్లంఘించిందని 533 మిలియన్ డాలర్లను అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పలుమార్లు రవీంద్రన్ కు కోర్టు నోటీసులు పంపినా స్పందనలేదు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా డెలావేర్ లోని దివాలా కోర్చు డిఫాల్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది.

ఈ తీర్పును రవీంద్రన్ ఖండించారు. అప్పీల్ కు వెళ్తానన్నారు. ఆల్ఫా సంస్థ నుంచి తీసుకున్న నిధులను వ్యక్తిగతంగా వాడలేదని, మాతృసంస్థ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (TLPL)కోసమే ఖర్చు చేశామని పేర్కొన్నారు.

Next Story