- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు.. ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే..?
భారతదేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో వివిధ రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గం నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతజీర్ మెహదీ ముందంజలో ఉన్నారు. నాగ్‌రోటా నుంచి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా లీడ్‌లో కొనసాగుతున్నారు. జార్ఖండ్‌లోని ఘాట్సిలా నియోజకవర్గంలో జేఎంఎమ్ అభ్యర్థి సోమేశ్ చంద్ర సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.
మరోవైపు మిజోరం రాష్ట్రంలోని డంపా నియోజకవర్గంలో MNF అభ్యర్థి డా. ఆర్. లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఒడిషా నుపదలో బీజేపీ అభ్యర్థి జే ధోలాకియా భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పంజాబ్‌లోని టర్న్ టరన్ సీటులో ఆప్ అభ్యర్థి హర్మీత్ సింగ్ సండు లీడ్‌లో కొనసాగుతున్నారు. రాజస్థాన్‌లో అంటా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ ఆధిక్యంలో ఉండగా, తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీణ్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.






