- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు ఇవే.. తెలంగాణ-రాజస్థాన్‌లో కాంగ్రెస్ దూకుడు, జమ్మూకశ్మీర్‌లో BJP
దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఉపఎన్నికల (By-election results) ఫలితాలు వెలువడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెల కొన్నప్పటికీ, ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయం భిన్నంగా వ్యక్తమైంది. తెలంగాణ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ రాణించగా, జమ్మూకశ్మీర్‌లో BJP, PDPలు విజయాలు సాధించాయి. జార్ఖండ్, పంజాబ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వివిధ పార్టీలకు గెలుపులు దక్కాయి.
ఉపఎన్నికల ఫలితాలు ఇలా..
తెలంగాణలో జూబ్లీహిల్స్ (Jubilee Hills–61) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. రాజస్థాన్‌లోని అంటా (Anta–193) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ విజయం దక్కించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో బడ్గామ్ (Budgam–27) నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహ్దీ విజయం సాధించారు. అలాగే నగ్రోట (Nagrota–77)లో BJP అభ్యర్థి దేవయాని రాణా గెలుపొందారు. జార్ఖండ్‌లో ఘట్సిల (Ghatsila–45)లో జార్ఖండ్ ముఖ్తి మోర్చా అభ్యర్థి సోమేశ్ చంద్ర సోరెన్ ఆధిక్యంలో నిలిచారు. మిజోరాంలో డంపా (Dampa–2)లో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్. లల్తాంగ్లియానా ఉప ఎన్నికల్లో గెలిచారు. ఒడిశాలోని నౌపడా (Nuapada–71)లో BJP అభ్యర్థి జై దొలాకియా ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్‌లో తర్ణ్ తారన్ (Tarn Taran–21)లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సందు విజయం సాధించారు.






