Robert Kiyosaki: వెంటనే బంగారం కొంటే పేదలు ధనవంతులు అవుతారు.. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత కీలక సూచన

by Prasad Jukanti |

ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్న వేళ ప్రముఖ రచయిత కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Robert Kiyosaki:  వెంటనే బంగారం కొంటే పేదలు ధనవంతులు అవుతారు.. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు 'బేర్' మంటున్నాయి. గత కొంత కాలంగా భారీ ఒడిదుడుకుల నడుమ సాగుతున్న మార్కెట్లలో ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగువేస్తారో అనే భయం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేండా చేస్తోంది. ఈ అనిశ్చితి పరిస్థితుల మధ్య తమ ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి? మార్కెట్లో అతిపెద్ద తనాన్ని చవిచూస్తే మళ్లీ తేరుకోగలమా అనే అనుమానాలు ప్రజలందరినీ వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాసిన ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే బంగారం, వెండి, బిట్ కాయిన్ లపై పెట్టుబడులు పెట్టాలని అలా చేస్తే పేదలు ధనికులుగా మారుతారని సలహా ఇచ్చారు.

౩౦ వేల డాలర్లకు బంగారం:

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ఎక్స్ వేదికగా స్పందిచిన కియోసాకి గతంలో తాను చెప్పిన ఆర్థిక విషయాలన్నీ దాదాపుగా నిజమయ్యాని పేదవాళ్లు ఇప్పుడు బంగారం (Buy gold) కొంటే భవిష్యత్‌లో ధనికులవుతారని పోస్టు చేశారు. 2035 నాటికి బిట్‌కాయిన్ విలువ 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, బంగారం 30 వేల డాలర్లుగా, వెండి 3 వేల డాలర్లకు చేరుకుంటుందన్న కియోసాకి అంచనా వేశారు. '2025 లో క్రెడిట్ కార్డ్ అప్పు అన్ని సమయాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. అమెరికా మరింత తీవ్ర ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తుండవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నాకు బాధగా ఉంది. నిజానికి నా చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించబడ్డాయి. నా హెచ్చరికలను పాటించిన వారు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పటికీ ఏదైనా చేయగలరు. బహుశా ధనవంతులు కూడా కావచ్చు, చాలా ధనవంతులు కూడా కావచ్చు. నా ఎక్స్ పోస్ట్‌లను అనుసరించే మీలో చాలా మంది నేను తరచుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనండి అని పదే పదే చెబుతున్నానని ఫిర్యాదు చేశారు. కానీ నేను ఇదే సలహాను మళ్లీ పునరావృతం చేస్తున్నాను. మీరు నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం మించిపోలేదు. మార్కెట్లు పతనమై సంక్షోభానికి గురైతే వెంటనే బంగారం, వెండి, బిట్ కాయిన్స్ పై పెట్టుబడి పెట్టిన వారు ఆ సంక్షోభం నుంచి ధనవంతుడిగా మారవచ్చు. ఆలస్యం చేస్తే అది భారీ మూల్యంగా మారవచ్చు. ప్రయత్నిస్తాను, ఆలోచిస్తాను అనే మాటలు వద్దు. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా 1/2 వంతు బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తే ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నాను. ఈ పతాన్ని వృథా చేసుకోకండి. అధ్యయనం చేయండి. నేర్చుకోండి. ప్రణాళికను రూపొందించి నిర్ణయం తీసుకోండి' అని ట్వీట్ చేశారు.

Next Story