ఇద్దరి కోసం 37 ప్రాణాలు రిస్క్! హైవేపై బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా

by Ramesh Naini |

మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో సోమవారం లాతూర్-నాందేడ్ హైవేపై అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి రాష్ట్ర రవాణా బస్సు బోల్తా కొట్టింది.

ఇద్దరి కోసం 37 ప్రాణాలు రిస్క్! హైవేపై బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర (Maharashtra) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాతూర్ జిల్లాలో సోమవారం (Latur-Nanded Highway) లాతూర్-నాందేడ్ హైవేపై అడ్డుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి రాష్ట్ర రవాణా బస్సు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ఉన్న దాదాపు 37 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. అహ్మద్‌పూర్ డిపోకి చెందిన బస్సు లాతూర్‌కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

సర్వీస్ రోడ్డు నుంచి హైవే పైకి బైక్‌పై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటేందుకు ట్రై చేసిన సమయంలో ఆర్టీసీ బస్సును గమనించ లేదు.. అదే సమయంలో రోడ్డు మధ్యలో బైక్ బస్సుకు అడ్డంగా వచ్చింది. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ బైక్‌ను ఢి కొట్టకుండా ఉండేందుకు పక్కకు తప్పించే క్రమంలో బస్సు పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకి అటువైపుగా వెళ్లి బోల్తా పడింది. ఘటనలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లు, ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రులకు స్థానికులు, అధికారులు తెలిపారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇక, ఆ బస్సులో మహిళలు, పలువురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి వెళ్తున్నారని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఘటనకు కారణం బైక్, బస్సు డ్రైవర్‌ల ఇద్దరిది తప్పు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరి కోసం అంత మంది ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఏమిటని డ్రైవర్‌పై ఓ నెటిజన్ మండిపడ్డారు.

Next Story