- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bus Falls: లోయలో పడిన బీఎస్ఎఫ్ జవాన్ల వాహనం.. ముగ్గురు సైనికులు మృతి
మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు చెందిన వాహనం లోయలో పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ (Manipur)లోని సేనాపతి (Senapathi) జిల్లాలో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు చెందిన వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారిపై చాంగౌబంగ్ (Changovbang) గ్రామ సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. జవాన్లు విధుల్లో భాగంగా కాంగ్ పోక్పి జిల్లా నుంచి మయాంగ్ కాంగ్‌లోని తమ క్యాంపునకు వస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మరణించారని పోలీసులు తెలిపారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని సేనాపతి ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Ajay kumar Bhallah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.






