Bus accident: జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు.. 17 మందికి తీవ్ర గాయాలు

by B.Srinivas |

జమ్మూ కశ్మీర్‌ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరం నుంచి ఢిల్లీకి యాత్రికులను తీసుకెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది.

Bus accident: జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు.. 17 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరం నుంచి ఢిల్లీకి యాత్రికులను తీసుకెళ్తున్న ఓ బస్సు జమ్మూలోని అంబ్పల్లా సమీపంలోని 30 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్య్సూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జమ్మూ బస్ స్టాండ్ నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బస్సు పడిపోయినట్టు వెల్లడించారు.

గాయపడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ను హిమాచల్‌కు చెందిన రాకేష్‌గా గుర్తించారు. గాయపడిన యాత్రికులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar abdhullah) స్పందించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించిన రెస్య్కూ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Next Story