సీనియర్‌ ఐపీఎస్‌ ఇంట్లో గుట్టులుగా నోట్ల కట్టలు.. సీబీఐ అధికారుల మైండ్ బ్లాంక్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-17 03:53:42  IST  )

కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS)లు తప్పడుగులు వేస్తున్నారు.

సీనియర్‌ ఐపీఎస్‌ ఇంట్లో గుట్టులుగా నోట్ల కట్టలు.. సీబీఐ అధికారుల మైండ్ బ్లాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS)లు తప్పడుగులు వేస్తున్నారు. ప్రజల హితం కోసం పని చేయాల్సిన వారు లంచాలు మేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా పంజాబ్‌ (Punjab) రాష్ట్రంలోని రోవవర్ రేంజ్ డీఐజీ, ఐపీఎస్ హర్‌చరణ్ సింగ్‌ భుల్లర్‌ (Harcharan Singh Bhullar)ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ కేసులో ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేయగా.. ఆ విషయం కాస్త సీబీఐకి చేరింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి డీఐజీ హర్‌చరణ్ సింగ్‌ భుల్లర్‌ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది చూసిన సీబీఐ అధికారులకు మతిపోయింది. భారీగా విలువైన వివిధ దేశాల వాచ్‌లతో పాటు భారీ ఎత్తున బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి.

ప్రస్తుతం రోవర్‌ రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్న హర్‌చరణ్ సింగ్‌ భుల్లర్ ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేసినట్లుగా సీబీఐ అధికారులు ధృవీకరించారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.8 లక్షలు డిమాండ్‌ చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే, చండీగఢ్‌లోని సెక్టార్‌ 21లో డీఐజీ తరఫున లంచం తీసుకొంటున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం డీఐజీని అదుపులోకి తీసుకుని చండీగఢ్‌, పంజాబ్‌లలోని అతడి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ రెయిడ్స్‌లో రూ.5 కోట్లకు పైగా నగదుతో పాటు కిలోన్నర బంగారు ఆభరణాలు, స్థిర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, మెర్సిడెజ్‌, ఆడి వంటి ఖరీదైన రెండు కార్లు, 22 విదేశీ లగ్జరీ వాచ్‌లు, లాకర్‌ తాళాలు, 40 లీటర్ల దిగుమతి చేసిన లిక్కర్‌ బాటిళ్లు, పలు ఆయుధాలను అధికారులు సీజ్‌ చేశారు.

Next Story